విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : వంగర మండలం అరసాడ గ్రామంలో పీవీసీ గ్రూపు ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న రూ.102 కోట్ల కాంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్‌కు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాజాం తహసిల్దార్ కార్యాలయంలో జరిగింది.అవసరమైన భూమి కేటాయింపు, అనుమతులు వేగంగా పూర్తిచేయడంలో ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం తెలిపారు. వ్యవసాయ మిగులు పదార్థాలు మరియు పశువుల వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోటి బంగార్రాజు, విజయనగరం జిల్లా కలెక్టర్ రాo సుందర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రాంతంలో పరిశ్రమ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.


