పార్టీ బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
సిపిఐ చిత్తూరు జిల్లా 24 వ మహాసభల లో భాగంగా రెండవ రోజు ప్రతినిధుల మహాసభ నగరి లోని వసుమతి దేవి ప్రాంగణం లో కోదండయ్య, విజయ గౌరీ, ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది. ప్రతినిధుల మహాసభలు ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ నాయకులు వేలన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి.జనార్ధన్ గత మహాసభల నుండి నేటి వరకు మృతి చెందిన అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ సమాజ హితం కోసం నిలబడేది కమ్యూనిస్టు లే అన్నారు. అలాంటి పార్టీ నీ బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉంది అన్నారు. చిత్తూరులో రౌడీ లను తరిమి కొట్టిన ఘనత సిపిఐకే దక్కుతుంది అన్నారు. బూర్జువా పార్టీ లలో నాయకులు రోజుకు ఒక పార్టీనీ మారుతున్నారు అన్నారు. వర్గ దృక్పథం తో కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోంది అన్నారు. ఎన్నో ఆటు పోటులు ఎదుర్కొని కార్యకర్తలు పని చేస్తున్నారు అని చెప్పారు. పార్టీ కోసం తొలితరం నేతలు చేసిన త్యాగాలను కార్యకర్తలు స్పూర్తిగా తీసుకోవాలి అని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి అని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23 వ తేదీ ఒంగోలు లో జరిగే రాష్ట్ర మహాసభలకు చిత్తూరు జిల్లా నుండి వేలాది మంది తరలి వచ్చి ర్యాలీ బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చర్చించి తీర్మానాలు, భవిష్యత్తు కార్యాచరణ చేయనున్నామని తెలియ చేశారు. గతం లో కేంద్రంలో రాష్ట్రం లో అధికారం లో ఉన్న బిజెపి, వైసిపి పై పోరాటం సాగించామని చెప్పారు. నేడు అధికారం లోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వానికి ఏమి తేడా లేకుండా పరిపాలన సాగిస్తున్నారు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఖజానా ఖాళీ అని చేతులు ఎత్తివేయడం చంద్ర బాబు దివాలకోరూ రాజకీయాలు నిదర్శనం అన్నారు. పి 4 పథకం తో పేదరికాన్ని పారదోలే ఆలోచన కంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారికి శాశ్వత పరిష్కారం చూపాలి అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోగా అసెంబ్లీ లో కనీస ప్రస్తానం లేదని విమర్శించారు. ఈలాంటి విధానాల పై పోరాటాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు, శివారెడ్డి మాట్లాడుతూ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమర శీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరించిన వేలన్ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశాము అన్నారు. నగరి నియోజక వర్గంలో వివిధ ఫ్యాక్టరీ లలో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారి సమస్యల పై పోరాటం సాగించామని చెప్పారు. జెండా ఆవిష్కరణ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజన్ కార్యదర్శి నివేదిక ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ గుర్రప్ప, హరిబాబు, డప్పుసూరి ఆలపించిన విప్లవ గేయాలు ప్రతినిధులను ఉత్సాహపరిచాయి.


