Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకూటమి ప్రభుత్వానిది నియంతృత్వ దోరణి

కూటమి ప్రభుత్వానిది నియంతృత్వ దోరణి

- Advertisement -


పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల నిషేదం సరికాదు...

ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి…
ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనలు...

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బందెల నాసర్‌ జీ
విశాలాంధ్ర`విజయవాడ: విద్యార్ధుల హక్కులను హరించేలా పాఠశాలలు, జూనియర్‌ కళాశాల్లోకి విద్యార్ధి సంఘాలు ప్రవేశించకుండా నిషేదిత ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడ దాసరి భవన్‌లో విద్యార్థి సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం బందెల నాసర్‌ జీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆగస్టు ఒకటవ తేదీన విడుదల ఉత్తర్వులను చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాదని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం, విద్యా రంగంలో ఉన్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తాయని, ఈ పద్ధతిలో విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్య అని ఆరోపించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ , కార్పొరేట్‌ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వ నాయకులవేనని శ్రీ చైతన్య , నారాయణ , భాష్యం ఈ పాఠశాలల ఫీజుల దోపిడీని పుస్తకాలను అధిక ధరలు అమ్ముకోవడానికీ, విద్యను వ్యాపారం చేసుకోవడానికి వారు మేలుకోసమే ఈ ఉత్తర్వులు అన్నారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, ప్రజా జీవితంపై అవగాహన, హక్కులు మరియు బాధ్యతలను విద్యార్థి సంఘాలు తెలియచేస్తాయని నాసర్‌ జీ పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌, పీడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ, తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోందని, ఇది విద్యార్థుల అభివృద్ధికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలను అణచివేయడమే లక్ష్యంగా ఉన్న ఈ
ఉత్తర్వులు ఆమోదయోగ్యమయ్యే ప్రకారం లేవని. ఈ నెల 13, 14 వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్తరం వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సానుకూలమైన నిర్ణయం ప్రకటించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలు చెప్పడతామని హెచ్చరించారు. అన్ని ప్రజాస్వామ్యవాద శక్తులు ఈ దుర్ణీతికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో పిడిఎస్‌ఓ రాష్ట్ర నాయకురాలు భాను శ్రీ, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్‌, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర నాయకులు త్రినాధ్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కార్తీక్‌, వెంకటేశ్వర రావు, యశ్వంత్‌, ప్రణీత్‌, డేవిడ్‌, షణ్ముఖ్‌, అమర్నాథ్‌, చరణ్‌, దీపక్‌, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు