Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియోగాతోనే ఏకాగ్రత బుద్ధి ఆలోచన శక్తి పెరుగుతాయి..

యోగాతోనే ఏకాగ్రత బుద్ధి ఆలోచన శక్తి పెరుగుతాయి..

యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: యోగాతోనే ఏకాగ్రత బుద్ధి ,ఆలోచన శక్తి పెరుగుతాయని యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయ అధికారులకు ప్రజలకు యోగ పై మంచి శిక్షణ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడటమే మా లక్ష్యము అని తెలిపారు. ఈ శిక్షణలో ప్రతిరోజు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆసనాలు, యోగ మేలుకువలు తెలపడం జరుగుతుందని తెలిపారు. యోగ వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఈ యోగా శిక్షణలో ఎంపీడీవో మనోహర్, ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, టిపిఓ పెనుబోలు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు