Homeఆంధ్రప్రదేశ్మోడీ కనుసన్నల్లో రాజ్యాంగ సంస్థలు

మోడీ కనుసన్నల్లో రాజ్యాంగ సంస్థలు

- Advertisement -

. ఎన్నికల కమీషన్ ది పూర్తి బాధ్యతారాహిత్యం
. బీసీ లలో పుట్టిన మోడీ వారికే మోసం
. జగన్ కు మోడీ అమిత్ షా లే రక్షణ
. రియల్ ఎస్టేట్ వ్యాపారి గా మారిన చంద్ర బాబు
. 12 న పలాస భూముల సందర్శన, ఆందోళన
. తిరుపతి లో దళిత యువకుడు పై దాడి దుర్మార్గం
. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ

విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాల్సింది పోయి,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పాలన సాగిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.తిరుపతి నగరంలో సీపీఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు,నితీష్ వల్ల మనుగడ సాగిస్తోంది అన్నారు. .అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నారని,ట్రంప్ ను మోడీ ఇప్పటివరకు వ్యతిరేకించడం లేదని తెలిపారు. ట్రాంప్ ఆర్థిక ఆంక్షల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నా మోడీ కి జ్ఞానోదయం కాకపోవడం దురదృష్టకరం అన్నారు. సంచాలనాత్మకంగా ప్రచారంలో ఉన్న దొంగ ఓట్ల జాబితా ఎన్నికల కమీషన్ నిర్లక్ష్యపు పనితీరు కు అద్దం పడుతోందన్నారు.గతం లోనే ఓట్ల చేర్పులు, తొలగింపులపై తిరుపతిలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆధారాలతో సీపీఐ ఆధ్వర్యంలో చూపించామని గుర్తు చేశారు.ప్రస్తుతం రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో నిరూపించారని అన్నారు.ఎన్నికల కమీషన్ ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించలేదన్నారు.స్వతంత్ర సంస్థలు గా పనిచేయాల్సిన వ్యవస్థలు మోడీ నియంత్రణ లోని వెళ్లిపోయాయన్నారు.
ఇటీవల ఉగ్రదాడి లో మరణించిన వారికి కేంద్రం పూర్తి ఆర్థికసాయం అందించలేదన్నారు.విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు పై న్యూయార్క్ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి పై కేసు నడుస్తోందన్నారు.స్మార్ట్ మీటర్లు అమర్చితే దేశ వ్యాపితంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ప్రధాని మోడీ బిసిలలో పుట్టి వారికే మోసం చేస్తున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త సీసా లో పాత సారా అన్న చందంగా పాలన సాగుతోందని విమర్శించారు. అమరావతి లో భూసేకరణ పేరుతో ప్రభుత్వం వ్యాపారాలు చేస్తున్నారన్నారు.మరోసారి భూసేకరణ చెయ్యాల్సిన అవసరం ఎంటన్నారు. రైతులనుంచి భూములు సేకరించి వ్యాపారులకు అప్పగిస్తున్నారన్నారు.శ్రీకాకుళం లో 1400 ఎకరాల భూమిని కార్గో కు అప్పగించడానికి బాబు ప్లాన్ చేశారని అన్నారు.శ్రీకాకుళం లో ఈనెల 12 న సీపీఐ ఆధ్వర్యంలో తాము ఆందోళన, ప్రత్యక్ష పోరాటం చేస్తామని ప్రకటించారు.ఎపి లో వివేకానంద రెడ్డి హత్యకేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కేంద్ర కటాక్షము లేకపోతే ఎలా బయట తిరుగుతారు అని ప్రశ్నించారు.సీబీఐ నింపాదిగా విచారణ పూర్తయిందని చెబుతున్నా మోడీ,అమిత్ షా లే రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.తిరుపతి లో దళిత యువకుడిని రూంలో పెట్టి వైకాపా నాయకులు దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.దాడి చేసిన వారు భూమన కరుణాకర్ రెడ్డి,అతని తనయుడు అభినయ రెడ్డి అనుచరులని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఖండించకపోవడం వెనక అంతర్యం ఏంటని ప్రశ్నించారు.నిందితులు కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద అరెస్ట్ కావడం పై వారిపైనే అనుమానం వస్తోందని తెలిపారు.ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు