విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : మోడీ ` అమిత్‌షాలు దొంగ ఓట్లను రాసుకుంటున్నారని , ఎన్నికల కమీషన్ వారికి తొత్తులుగా మారిపోయిందని , రాష్ట్రంలో సుపరిపాలన లేదని అంతా అప్పులపాలేనని, ప్రభుత్వం మారినా పాలన మారలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం సీపీఐ 24వ జిల్లా మహసభల సందర్భంగా పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ సర్కిల్లోని కామ్రేడ్ సలాంఖాన్ ప్రాంగణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య అద్యక్షతన జరిగిన బహిరంగ సభ నుద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకు ముందు జిల్లా పరిషత్ నుండి పాతబస్టాండ్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. సీపీఐ నాయకులు చదువుల రామయ్య, బీజీ మాదన్న, ఓబి నాగన్న, పుప్పాలదొడ్డి వెంకటేశ్వర్లు, నక్కి రామన్నతోపాటు జిల్లా నలుమూలల నుండి అమరవీరుల స్తూపం నుండి తీసుకు వచ్చిన జాత పతాకాలను నాయకులకు అందచేశారు. అనంతరం బహిరంగ సభ నుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో కొంత మంది దౌర్జన్యంగా ఓటు వేయనీయకుండా రిగ్గింగ్ చేసేవారని వాటిని వ్యతిరేఖంగా సీపీఐ పలు ఆందోళనలు చేసిందన్నారు. కానీ నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈవీఎంల పేరుతో దొంగ ఓట్లును వేసుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధి ఆరు నెలలు సర్వే చేయిస్తే బెంగుళూరు మహానగరంలో దొంగ ఓట్లు వేసినట్లు బహిర్గతమైందన్నారు. బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 80వేల మెజారిటీ వస్తే ఒక్క నియోజకవర్గంలో బీజేపీకి లక్షా 80వేల మెజారిటీ రావడం ఆఎన్నికల్లో బీజేపీ 34 వేల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించడం జరిగిందన్నారు. సర్వేలో ఒక్క ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు. విచారణ చేస్తే ఆపేరు ఉన్న వారు లేరని చెప్పడం దారుణమన్నారు. బీజేపీ మొత్తం దొంగ ఓట్లు రాసుకుంటుందని విమర్శించారు. బీహార్‌లో బీజేపీకి వ్యతిరేఖంగా ఉన్న 65లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. దేశంలో పక్కా దొంగలరాజ్యం నడుస్తుందన్నారు.జిల్లా సమగ్రాభివృది ్దకోసం జిల్లా మహాసభల్లో చర్చించి తీర్మాణం చేసి భవిష్యత్ కార్యచరణ చేపడతామన్నారు.ఆహ్వానసంఘం ప్రదాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, ఆవుల శేఖర్, ఎన్ లెనిన్‌బాబు, మాజీ జిల్లా కార్యదర్శి పీ భీమలింగప్ప, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎస్ మునెప్ప, ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రదాన కార్యదర్శి లలితమ్మ, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రదాన కార్యదర్శి శ్రావణి, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిద ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దొంగ ఓట్లతో పాలన మోడీ అమిత్‌షా తొత్తులుగా ఎన్నికల కమీషన్
- Advertisement -
RELATED ARTICLES


