Sunday, January 18, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర-విజయవాడ (వన్‌టౌన్‌): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని దేవాదాయ ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణను ఉద్యోగ సంఘ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రధాన దేవాలయాల ఎన్‌ఎంఆర్‌ పే స్కేల్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎన్వి.రమణ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు బుధవారం మంత్రిని కలిసి కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. దీనికి మంత్రి రామనారాయణ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కూడా త్వరలోనే కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు