Saturday, April 19, 2025
Homeజిల్లాలునెల్లూరుఉపాధిహామీ పనుల్లో 2,05049 లక్షలరూపాయలు అవినీతి

ఉపాధిహామీ పనుల్లో 2,05049 లక్షలరూపాయలు అవినీతి

సామాజిక తనిఖీ ప్రజావేదికలో అధికారులు వెల్లడి

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలో 21 పంచాయతీ లలో 2023 ఏప్రిల్ 1 నుండి2024 మార్చి31 వరకు జరిగిన ఉపాధిహామీ పనులపై సామాజిక బృందం తనిఖీలు చేసింది.మండలంలో 1216పనులకు 14.70 కోట్లు మంజూరు చేసింది.గురువారం నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో 2,0,5,049 లక్షలరూపాయలు అవినీతి జరిగినట్లు డ్వామా పీడీ గంగా భవాణి వెల్లడించారు.అమ్మపాలెంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో 32,601రూపాయలు, అంకభూపాలాపురం పంచాయతీ లో 13,225రూపాయలు,అయ్యవారిపల్లి పంచాయతీ లో 25,103 రూపాయలు, బడేవారిపాలెం పంచాయతీ లో 976రూపాయలు,చుండి పంచాయతీలో 75,732 రూపాయలు,కాకుటూరు పంచాయతీ లో 1,350 రూపాయలు,కొండసముద్రం పంచాయతీలో 1,000 రూపాయలు,కొండారెడ్డి పాలెం పంచాయతీ లో 500రూపాయలు,నలదలపూరు పంచాయతీ 180రూపాయలు,నేకునాంపురం పంచాయతీ లో 17,914రూపాయలు,నూకవరం పంచాయతీ లో 20,363 రూపాయలు,పోకూరు పంచాయతీ లో 2,100 రూపాయలు,పోలినేని చెరువు పంచాయతీలో 2,500రూపాయలు,పోలినేనిపాలెం పంచాయతీ లో 2,032రూపాయలు,శాఖవరం పంచాయతీ లో 5,212రూపాయలు,సమీర్ పాలెం పంచాయతీ లో 810రూపాయలు,సింగమనేనిపల్లి పంచాయతీ లో 541 రూపాయలు,వలేటివారిపాలెం పంచాయతీ లో 1,620రూపాయలు,జెడ్ ఉప్పలపాడు పంచాయతీ లో 1,290రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక బృందం సభ్యులు తెలిపారు. ఈ రికవరీ సొమ్ము మొత్తాన్ని ఆయా గ్రామాలకు సంబందించిన పీల్డ్ అసిస్టెంట్ లు, టీఏ ల నుంచి రికవరీ చేయాలని సంబందిత అధికారులను పీడీ గంగా బావాణి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి డి. విజయలక్ష్మి, ఎంపిడిఓ నరేంద్ర దేవ్, సర్పంచ్ సాదు శ్రీలత, ఏపీఢీ బాబూరావు, ఎస్ ఆర్ పీ. ఆవులయ్య ఏపీఓ లు ఉమామహేష్, సమీర్ బాషా, దయాసాగర్,ఈ సీ వంశీ,టీ ఏ లు,మాలకొండయ్య, ప్రసాదు, నాగార్జున, చిన్నయ్య, మాలకొండయ్య, సీఓ లు మధు, బాషా, పీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు