— వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు.
విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివలన అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రోడ్ల దుస్థితి చాలా దారుణంగా ఉందని విమర్శించారు. ప్రచారంలో ముందున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామి నాయుడు, మండల అధ్యక్షులు యాదల సతిష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు, స్థానిక నాయకులు గంగారావు, బుడ్డిగ పండు, చింతపర్తి రాంబాబు, చింతపర్తి చిట్టిబాబు, జాన్ బాబు నరమామిడి గణేష్, టీవీ ప్రసాద్, తాడాల చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, ఊటుకూరి శైలజ, సాపిరెడ్డి సూరిబాబు, సాపిరెడ్డి కామేష్, పోరాటి శీను, సంగీత వెంకటేశ్వరరావు, చొల్లంగి సత్య గిరి, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.


