Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తికి సిపిఐ సన్మానం

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తికి సిపిఐ సన్మానం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కోర్టులో గల న్యాయవాదులకు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రస్తుత లాయర్ డిఎల్ఎన్ మూర్తి ప్రధాన కార్య దర్శిగా ఎంపిక కావడం పట్ల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, శ్రీధర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులుగా పనిచేస్తూ ఎన్నో విజయాలను చేకూర్చడం జరిగిందన్నారు. తదుపరి లా పూర్తి చేసుకొని కోర్టులో కూడా మంచి గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. డి ఎల్ ఎన్ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాటం జరిపి పరిష్కార దిశగా తాను కృషి చేస్తానని, పేద ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు