Sunday, January 18, 2026
Homeఆంధ్రప్రదేశ్మన ఊరు - మాటా మంతిలో పవన్‌కు సమస్యలు విన్నవించిన రావివలస గ్రామస్తులు

మన ఊరు – మాటా మంతిలో పవన్‌కు సమస్యలు విన్నవించిన రావివలస గ్రామస్తులు

- Advertisement -

అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మన ఊరు – మాటా మంతి పేరుతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రావివలస గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి తెలుపుకునే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు