విశాలాంధ్ర- అనంతపురం : ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు సోమవారం కార్పొరేటర్ పద్మావతి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి సిపిఐ నగర కార్యదర్శి సి. జాఫర్ కామ్రేడ్ వరలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాఫర్ పాల్గొని మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ మహిళాసమాఖ్య జిల్లా కోశాధికారిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా అనంతపురం నగరంలోని కార్పొరేటర్ గా మున్సిపల్ ఆఫీసులో సిపిఐ గళం విప్పి యధాదిష్టిగా మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు కాలనీలో వాటర్ సంబంధించి డ్రైనేజీ కాలువలు వీధిలైట్లు ఆ డివిజన్ అభివృద్ధి కొరకు ఎంతో తోడ్పాటునిచ్చిన కామ్రేడ్ పద్మావతి కి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాదు మాట్లాడుతూ… ఆమె మరణం మహిళా సమాఖ్య కి ఎంతో తీరని లోటు అని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య కి డివిజన్ నుండి రాష్ట్ర నలుమూలల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఢిల్లీ వరకు పార్టీ కోసం సేవలు చేశారన్నారు. సోదరి భావంతో ఎంతో ప్రేమగా ప్రతి మనిషిని ఆకట్టుకునే విధంగా అందరితో కలిసి మెలిసి మహిళా సమాఖ్యలో ఎన్నో అరెస్టులకు గాని ధర్నాలలో గాని రాస్తారోకో లో గాని మహిళ సమస్యల పరిష్కారాల కోసం భార్యాభర్తల విషయాల్లో పోలీస్ స్టేషన్ లో గాని మున్సిపల్ ఆఫీసులో గాని మహిళా పక్షపాతిగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొనడం జరిగిందన్నారు. ఆమె స్ఫూర్తితోనే మహిళా సమాఖ్య ముందుకు పోతోందని ఆమెకు ప్రగాఢ సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు జానకి సింగనమల నియోజకవర్గం కార్యదర్శి లక్ష్మీదేవి కమ్మక్క రమాదేవి అనిత వనజ ప్రజానాట్యమండలి హక్కులప్ప తదితరులు పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది