Friday, December 13, 2024
Homeజిల్లాలుఅనంతపురంవిద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు సిపిఐ ఉద్యమ కార్యాచరణ

విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు సిపిఐ ఉద్యమ కార్యాచరణ

సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమ కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోడీకి లొంగిపోయి, అదానితో లాలూచీపడి ప్రజలపై భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే 6,072 కోట్లు వసూలు చేసేందుకు చార్జీలు పెంచి డిసెంబర్ నెల నుంచి వసూల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతోందన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనతో మరో 11,820 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడానికి పూనుకుంటున్నారు అని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు హామీలు గాలికొదిలి కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి కరెంట్ చార్జీలు పెంచబోతున్నారు అని తెలిపారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారన్నారు. గోరుచుట్టు పై రోకటి పోటులాగా గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. బుధవారం నుండి ఈనెల 30 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ సభలు ,సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు అన్నారు. ప్రజలపై భారం వేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని భారతకమ్యూనిస్టు పార్టీ, సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు