Thursday, December 12, 2024
Homeజిల్లాలుఅనంతపురంఐ ఎఫ్ టి యూ నుండి మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ లోకి చేరిక

ఐ ఎఫ్ టి యూ నుండి మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ లోకి చేరిక

ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ కార్మికులకు టి ఏ లు పెంచాలి..
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్

విశాలాంధ్ర- అనంతపురం : ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ కార్మికులకు టి ఏ లు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) కార్మిక సమస్యలపై నిర్వహిస్తున్న పోరాటాలు చూసి ఐ ఎఫ్ టి యూ లో నుండి ఏఐటీయూసీ బుధవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్,ఎఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి ఎఐటియుసి లో చేరుతున్న కార్మికులకు కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఎఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న పోరాటాలు చూసి కార్మికులు ఎఐటియుసి లో చేరుతున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్నిరకాల సేవలు అందిస్తున్నారన్నారు. నగరానికి సుదూర ప్రాంతంలో ఉన్న ముద్దలాపురం ఫిల్టరేషన్ ప్లాంట్ లో రాత్రి,పగలు అని తేడా లేకుండా కష్టపడుతూ నగర ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నారన్నారు. ఇంత కష్టపడుతున్న కార్మికులకు మాత్రం కనీస వేతనాలు ,ఇతర ఈపీఎఫ్ సమస్యల ను పరిష్కరించడం లేదన్నారు. ముద్దలాపురంకు రావడానికి పోవడానికి ఇస్తున్న ట్రావలింగ్ అలవెన్సులు కూడా సరిగా ఇవ్వడం లేదని, టి ఏ లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శులు నాగరాజు,వేణుగోపాల్,సమితి సభ్యులు కుళ్ళాయి రెడ్డి,నారాయణ స్వామి,గిరి
ఎఐటియుసి లో చేరిన వారు రాజు,వెంకటరమణ,భాస్కర్,ఇర్ఫాన్,వీరాంజనేయులు,లక్ష్మినారాయణ,పెద్దన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు