Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం

గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం

గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ప్రశ్నలకు అనిత సమాధానాలు
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అనిత

ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వారిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. ఐదేళ్లలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని… దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని తెలిపారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని… ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ ను కోరారు. ఈ సమావేశాలు లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చిద్దామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు