Homeజిల్లాలుఅనంతపురంపొగాకు వినియోగం-ప్రాణాంతకం

పొగాకు వినియోగం-ప్రాణాంతకం

- Advertisement -

డి. ఎం. అండ్ హెచ్ .ఓ డాక్టర్. కట్టా వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : పొగాకు వినియోగాన్ని నిర్మూలించడం ద్వారా పలు రకాల క్యాన్సర్ ,గుండె జబ్బులు లాంటి ఆసంక్రమిక వ్యాధులను పారద్రోల వచ్చని, మరణాలు నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జాతీయ పొగాకు నిర్మూలన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. పొగాకు వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని ఆయన సిబ్బందిని కోరారు.
ఆ సంక్రమిక వ్యాధుల కార్యక్రమ అధికారి డా. విష్ణుమూర్తి గారు మాట్లాడుతూ… బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధమని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు పదార్థాలు విక్రయించరాదని తెలిపారు. విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు దుకాణాలు ఉండరాదని తెలిపారు. పొగాకు వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు.
జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు గ మాట్లాడుతూ… పొగ తాగడం వలన అనేక భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయని, పొగ తాగే వారి కన్నా పక్కన ఉండి పీల్చే వారికే 60% క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం అందరితో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి మనోజ్ కుమార్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు కిషోర్, పణి , ఆంజనేయులు, ప్రేమ్, కిషోర్, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు