Homeజిల్లాలుఅనంతపురంట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్రను అభినందించి సన్మానం చేసిన జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్రను అభినందించి సన్మానం చేసిన జిల్లా ఎస్పీ

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్క : దులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు వేలాడుతున్న ఒక ప్రయాణికుడి ప్రాణాలను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన అనంతపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ సి.సురేంద్ర (పి సి -1550)ను జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రత్యేకంగా అభినందించి శనివారం సన్మానించారు.
గత నెల 29న ఉదయం సుమారు 9.00 గంటల సమయంలో, తిరుపతి జిల్లా వెంకటగిరి బందోబస్తు విధులకు వెళ్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రామాంజుల రెడ్డిని రైలు ఎక్కించేందుకు కానిస్టేబుల్ సురేంద్ర మరియు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ (హెచ్ సి -2308) అనంతపురం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఎస్ఐని రైలు ఎక్కించిన అనంతరం ప్లాట్‌ఫామ్ నంబర్-04పై నడుచుకుంటూ వస్తుండగా, భైరవ నగర్‌‌కు చెందిన రవికుమార్ (49) అనే ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పిడికిలి జారి, ఒక చేతితో హ్యాండిల్ పట్టుకుని ప్రమాదకరంగా వేలాడుతూ పోతుండటాన్ని కానిస్టేబుల్ సురేంద్ర గమనించారు.
​సమయస్ఫూర్తితో స్పందించిన సురేంద్ర, వెంటనే పరిగెత్తుకెళ్లి “హ్యాండిల్ వదిలేయ్” అని బిగ్గరగా చెబుతూ రవికుమార్ షర్ట్ కాలర్‌ను గట్టిగా పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేశారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పి, రవికుమార్ సురక్షితంగా బయటపడ్డారు. చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన రవికుమార్ కంటతడి పెడుతూ “నువ్వే నా పాలిట దేవుడివి” అని కానిస్టేబుల్ పాదాలకు నమస్కరించారు. సురేంద్ర ప్రదర్శించిన సాహసాన్ని అక్కడ ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది హర్షధ్వానాలతో అభినందించారు.
కానిస్టేబుల్ సురేంద్ర ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆయనను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల ప్రాథమిక విధి ప్రజల ప్రాణాలను రక్షించడమేనని, సురేంద్ర చూపిన చొరవ పోలీసు శాఖకే గర్వకారణమని ఎస్పీ కొనియాడారు. అనంతరం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున కానిస్టేబుల్‌ను ఎస్పీ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ సి.ఐ వెంకటేష్ నాయక్ , ఆర్ ఐ పవన్ కుమార్ , ట్రాఫిక్ ఎస్ ఐ రాంభూపాల్ , పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్ , సూర్యకుమార్ , గాండ్ల హరినాథ్ , లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు