Homeజిల్లాలుఅనంతపురంనార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం…

నార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం…

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా)-:- మండలంలోని చామలూరు పంచాయితీ పరిధిలోని నిలువురాయి, నార్పల గ్రామాల్లో ఉపాధి పనుల వద్దకు వెళ్లి కూలీలను కలిసి, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు మద్దతుగా కరపత్రాలు గురువారం పంపిణీ చేశారు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని, జి-రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ పేదలు, చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరిచిందని, దాని స్థానంలో హక్కులు లేని విధానాలను తీసుకువచ్చిందని విమర్శించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను కేంద్రం స్వాధీనం చేసుకుంటోందని, నిధులలో రాష్ట్రాల వాటాను పెంచడం వల్ల అమలు కష్టతరం అవుతోందని తెలిపారు.కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తూ పేదల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు లభిస్తున్న ఉపాధి హక్కులను కాపాడేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.ఏప్రిల్ 10న అనంతపురంలోని సమతాగ్రామ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. చివరి రోజు ఏప్రిల్ 12న బండ్లపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు కె. నారాయణతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు.వ్యవసాయ కూలీలు, పేదలు, దళితులు, చేతివృత్తిదారులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డి. పెద్దయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. నాగరాజు, సీపీఐ మండల కార్యదర్శి గంగాధర్, సహాయ కార్యదర్శి చాపల రామాంజి, సంఘం మండల కార్యదర్శులు పెద్ద పెద్దయ్య, సూరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు