వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీషాల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్
విశాలాంధ్ర ధర్మవరం;;చీరాల పట్టణంలొ కార్బన్ సెర్చ్ పేరుతొ టుటౌన్ సీఐ-శశికుమార్, గిరిజన వృద్ధ మహిళ(70 సంవత్సరాలు)ఇంటి వద్దకువెళ్లి నానా దుర్భషలాడుతూ,అతని తల్లి వయసున్న వృద్దురాలితో మాట్లాడాల్సిన మాటలేకాదు. కావున సీఐ పైన యస్సి-యస్టి కేసునమోదు చేసి, ఉద్యోగం నుంచి సస్పెండ్ చెయ్యాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవరకొండ రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలొ చంద్రబాబు పరిపాలన(కూటమి ప్రభుత్వం)అధికారంలోకివచ్చినప్పటినుంచి మహిళలపై దాడులు-హత్యాచారాలు-హత్యలు ఎక్కువైపోయాయని,రాష్ట్ర హోంశాఖామంత్రి,దళిత కులానికి చెందిన అనిత అయినా అవినీతి-అక్రమాలు-దనార్జనే ధ్యేయంగా, సాటి మహిళలకు రక్షణ కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో”వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ”ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో యం.చౌడప్ప,కునుతూరు గోపాల్,గుజ్జలబొమ్మన్న,సాకే.వెంకటేష్,యన్.గోపాల్ నాయక్,పి. కుళ్లాయప్ప,వెంకటరమణస్వామి,పి. శ్రీనివాసులు, మల్లెల.పెద్దన్న,గుజ్జల.రామకృష్ణ. నామాల. రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
సి ఐ శశి కుమార్ పై చర్యలు చేపట్టండి..
- Advertisement -
RELATED ARTICLES


