విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన గుండ్లమడుగు రవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకాల మరణం చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.రవి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన గురువారం రవి నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో రవి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, మాజీ ఎంపీటీసీ గవ్వల శ్రీరాములు, జిమాను రామకృష్ణ, నారాయణస్వామి, నాగరాజు తదితరులు పాల్గొని గుండ్లమడుగు రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


