Homeఆంధ్రప్రదేశ్తిరుచానూరు రహదారుల అభివృద్ధి

తిరుచానూరు రహదారుల అభివృద్ధి

- Advertisement -
  • తుడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష..
  • నిధుల మంజూరు, పనుల వేగవంతానికి తితిదే చైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాలు

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్ : తిరుపతి నగరంలోని తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధిపై బుధవారం తుడా కార్యాలయంలో తితిదే చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు తిరుచానూరు రోడ్ల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, భూసేకరణ, రహదారుల విస్తరణ ప్రణాళికలను వివరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి చేపట్టాలని సమావేశంలో చర్చించారు. ప్రణాళికలపై సంతృప్తి వ్యక్తం చేసిన తితిదే చైర్మన్ బి.ఆర్. నాయుడు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తుడా, తితిదే ఇంజినీరింగ్, ప్లానింగ్ విభాగాల అధికారులు, పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు