సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని లేపాక్షి మండలంలోని ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ లో జూలై నెల 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే జిల్లా సైద్ధాoతికతిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేద్దామని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భక్తి కోసం ఎందరో వీరుల ప్రాణత్యాగం వలన భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల పూర్తి చేసుకున్నదని వారి తెలిపారు. 2014 ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం ధరల నియంత్రణ, నల్లధనం వెలికితీత,జనధన్ ఖాతాలు ఉన్నవారి ఖాతాలలో రూ.15 లక్షల డబ్బు జమ చేస్తామని దేశ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేయడం దారుణమన్నారు.
శ్రమజీవుల స్వేదంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు కారు చౌకగా కట్టపెట్టడమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కారు చౌకగా కట్టపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి విబి జి రాంజీ పేరు చేర్చడం దుర్మార్గమన్నారు.రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు సూపర్ సిక్స్ పథకాలలో చెప్పిన విధంగా పట్టణాలలో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.మహిళా శక్తి పేర మహిళలకు నెలకు రూ.1500 జమ చేస్తామన్న హామీ ఏమైందని,నిరుద్యోగ భృతి, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్,స్కాలర్ షిఫ్ ఆటకెక్కించడం సరి కాదని హితువు పలికారు.టిడ్కో ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అంద జేయాలని కోరారు. కరువు, వలసలు,ఆత్మహత్యల నిర్మూలన కోసం శాశ్వత పరిష్కారాలు నిర్వహించాలని వారి డిమాండ్ చేశారు. ఇటీవలే బత్తలపల్లి లో శిక్షణా తరగతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కావున నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి ,తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలోని సిపిఐ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని తెలిపారు.
లేపాక్షి లో జూలై 27 నుండి 29 వరకు జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


