కేంద్రమంత్రి కి జడ్పీ చైర్మన్ వినతి…
విశాలాంధ్ర – వి.కోట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని వెనకబడిన తరగతులను రిజర్వేషన్ల నుండి మినహాయించడంపై వారికి మళ్లీ రిజర్వేషన్లు కల్పించి వారి పిల్లల చదువులకు ఉపయోగపడేలా చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు (వాసు) బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గౌడను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ఎంఎస్ 25 ప్రకారం వెనకబడిన తరగతుల కులాలు, ఉప కులాలకు కల్పించిన రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలగించారని వాటిని తిరిగి అమలు అయ్యేలా చేయాలని కోరినట్టు తెలిపారు. వినతి పత్రాన్ని అందుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామి గౌడ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అందజేసి వెనకబడిన తరగతుల అభివృద్ధికి తోడ్పాటు కల్పించనున్నట్టు తెలిపారు అన్నారు కార్యక్రమంలో ఆయనతోపాటు కర్ణాటక రాష్ట్రం జెడిఎస్ నాయకులు సీఎంఆర్ శ్రీనాథ్ శాంతిపురం మండల జడ్పిటిసి సభ్యులు శ్రీనివాసులు పాల్గొన్నారు.


