రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావు, కళాజ్యోతి కార్యదర్శి బి. రామకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో పురాతన నాణెముల ప్రదర్శన కళాజ్యోతి ఆవరణములో ఏప్రిల్ 11, 12 రెండు రోజులపాటు కళాజ్యోతి ఆధ్వర్యంలో కార్యదర్శి రామకృష్ణ ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజు అధ్యక్షులు నారాయణ, రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ , కళాజ్యోతి కార్యదర్శి బి. రామకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి చోళ రాజు, ధనుంజయ ఎరికల్ ముత్తు రాజు వేయించడం జరిగిందన్నారు. ఈ శాసనం కడప జిల్లాలోని కలమల్ల గ్రామంలో లభ్యమయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థల ఆహ్వానం మేరకు ప్రపంచ దేశాల నాణ్యములు నోట్లు వివిధ రాజుల కాలం నాటి పురాతన నాణెములను ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు విద్యార్థులు విజ్ఞానము కొరకు క్రీస్తుపూర్వం క్రీస్తు శకం వరకు వినియోగములోని నాణ్యములతో పాటు ఇండో గ్రీకులు ఇండో సాసానియన్ రాజులు కోటిలింగాల నాణ్యములు శాతవాహనులు ఇచ్చువాక్కులు, సెబికా రాజులు హిరణ్యక ఆనంద గోత్రికులు గుప్తులు విష్ణు కుండీనులు మగధరాజులు పల్లవులు జోలులు ఉజ్జయిని రాజులు తదితరులు వారి కాలము నాది నాణ్యములు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 250 దేశాలకు పైగా నాణ్యములు, ప్రపంచ దేశాల నోట్ల ప్రదర్శన, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం కాలమనాటి నోట్లు ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చునని తెలిపారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 1,000 మందికి పైగా ప్రజలు వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేసి వెళ్లడం జరిగిందని తెలిపారు.ఈ నాణెముల ప్రదర్శన తిలకించుటకు వందల సంఖ్యలో యువతి, యువకులు విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, సీనియర్ సిటిజన్ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి కార్యదర్శి బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కే రమేష్ బాబు, ఎల్ఐసి రామన్న, కే సోమశేఖర్, సలహాదారుడు ఎస్ రామకృష్ణ, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముగిసిన పురాతన నాణెముల ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


