Homeజిల్లాలుఅనంతపురంఅంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. దళితుల అభ్యున్నతి, కుల నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి స్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తుచేశారు. “జోహార్ అంబేద్కర్” అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ,పొన్నతోట రామయ్య, షైక్ రహంతుల్లా, తుపాకుల సురేష్, చరణ్‌కుమార్, లోకేష్, అశోక్, నారాయణస్వామి,జనసైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు