విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో జరుగనున్న జాతీయస్థాయి అస్మిత జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ప్రవిత,మధురిమాబాయి, దివ్య,హర్షిత,ఎంపికైనట్లు వారు తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ బి. సూర్య ప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు బండి వేణుగోపాల్, పళ్ళెం వేణుగోపాల్, హాకీ సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ బీ.వీ శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్, అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతి ప్రసాద్, ఇర్షాద్, అమునొద్దీన్, కిరణ్, సత్యసాయి జిల్లా హాకీ కోచ్ హస్సేన్ అభినందన
శుభాకాంక్షలు తెలియజేసారు.
ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు
- Advertisement -
RELATED ARTICLES


