Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయితమిళనాడులో ప్రతిభ చూపిన ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ ప్రదర్శన

తమిళనాడులో ప్రతిభ చూపిన ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ ప్రదర్శన

విశాలాంధ్ర ధర్మవరం;; తమిళనాడులోని అరుణాచలం దేవాలయములో సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంస్థ వారు నిర్వహించిన నేషనల్ లెవెల్ క్లాసికల్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, కమలా బాలాజీ వారి శిష్య బృందం 40 మంది తమ నాట్య ప్రదర్శనతో అందరిని ముగ్దుల్ని చేసింది. నాట్యం చేసిన వారందరికీ ఆదియోగి అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా గురువులు బాబు బాలాజీ, కమల బాలాజీలకు నాట్యతపసివి అవార్డు, కుమార్తెలు హర్షశ్రీ,రామ లాలిత్యాలకు నాట్య చూడామణి అవార్డులతో ఆ సంస్థ అధ్యక్షుడు ఆనందు ,ఆలయ ఈవో సురభి రాయల్ సర్టిఫికెట్స్ తో సహా మెమెంటోలను అందించడం తోపాటు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ మాకు తమిళనాడులో ఇటువంటి అవకాశం కల్పించిన సంస్థకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు జాతీయ అంతర్జాతీయ హలో కూడా విస్తరింప చేస్తామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని తమిళనాడులో నిర్వహించి విశేష గుర్తింపుతో పాటు అవార్డులు ప్రశంసా పత్రాలు పొందడం పట్ల ధర్మవరం కళాకారులు, అధికారులు, ప్రజలు, హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు