- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని కబాడీ కోచ్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ జరిగిన జిల్లా సాయి పోటీలలో మంచి ప్రదర్శనను ఘనపరిచి అండర్ 17 క్యాటగిరిలో హిమబిందు, అదేవిధంగా కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. అంతేకాకుండా గొట్లూరు గ్రామానికి చెందిన ఎల్ లిఖిత అండర్ 14 విభాగంలో బాపట్ల లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ తో పాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ ఇరువురి బాలికలకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


