విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన కామ్రేడ్ డి. జగదీష్‌ను కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పార్టీ ఇంచార్జ్‌గా, అలాగే ఎఐటియూసీ రాష్ట్ర ఇంచార్జ్‌గా నియమితులైన జగదీష్ శుక్రవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి నరసింహులు, ఎఐటియూసీ జిల్లా నాయకుడు రాజేష్, సిపిఐ మండల కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ నాయకులు బుడెన్, వెంకటేశులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, “జిల్లాలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఉద్యమాలు రాష్ట్ర స్థాయిలో తనకు గుర్తింపు వచ్చిందన్నారు . ఈ సన్మానం మరింత బాధ్యతను పెంచిందని” అన్నారు.


