Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన..

ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన..

- Advertisement -

నిర్వాహకులు బీరే శ్రీరాములు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బీరేగోపాలకృష్ణ మనవడు బీరే నిహాంత్ జన్మదిన సర్పంచ్ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని రక్త శిబిరం నిర్వహించుట ఎంతోమందికి ప్రాణాన్ని ఇస్తుందని, పునర్జన్మని ఇస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 39 మంది రక్తదానం చేయడం జరిగిందన్నారు. బీరే గోపాలకృష్ణ మాట్లాడుతూ మా మనవడు జన్మదిన సందర్భంగా ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, సహకరించిన బీరే శ్రీరాములకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీరాములు, వేల్పుల ఆంజనేయులు, గవ్వల నారాయణస్వామి, వంశీకృష్ణ తోపాటు చౌడేశ్వరి ఆలయ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు