విశాలాంధ్ర, ముదిగుబ్బ: మండల కేంద్రంలో ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుంపులుగా తిరిగే వీధి కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులను భయపెడుతున్నాయి. కాలనీల్లో పిల్లలను స్కూల్‌కి పంపేటప్పుడు కుక్కల గుంపులను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. ప్రజలు భయంలేని వాతావరణంలో జీవించేలా తగిన చర్యలు తీసుకోవాలని నివాసితులు విజ్ఞప్తి చేశారు.
ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద…
- Advertisement -
RELATED ARTICLES


