ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం; ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది అని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన దినంగా దీన్ని ప్రకటించారు అని తెలిపారు. దీన్ని మనం గుర్తించకపోతే జీవనోపాధిని , పర్యావరణ వ్యవస్థలను నిలబెట్టే సహజ వనరులు నాశనమైతే శాశ్వత శాంతి సాధ్యం కానందున, పర్యావరణంపై చర్య సంఘర్షణ నివారణ, శాంతి పరిరక్షణ, శాంతి నిర్మాణ వ్యూహాలలో భాగంగా ఉండేలా చూసుకోవడానికి ఐక్యరాజ్యసమితి గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుంది అని తెలిపారు. సమస్త జీవరాసులకు అలవాలమైన ప్రకృతిని తప్పక కాపాడుకోవాలి అన్నారు. అక్రమంగా చెట్లను నరికి వేయకుండా చూసుకోవాలి అని, అందుకోసమే నవంబర్ 6 ను పర్యావరణ పరిరక్షణ దినోత్సవం గా గుర్తించారు అని తెలిపారు. ఇప్పటికైనా మేల్కొని పర్యావరణం నాశనం కాకుండా చూసుకోవాలని ప్రజలందరూ బాధ్యత అని తెలిపారు. చెట్లను నరికి వేయకుండా కాపాడాలని నాయకులను ప్రశ్నించాలని, అధికారులకు బాధ్యతను గుర్తుచేయాలని తెలిపారు.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది..
- Advertisement -
RELATED ARTICLES


