విశాలాంధ్ర బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో గజగౌరీ దేవి అమ్మవారిఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 15జతల వృషభాలు పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి బహుమతి కింద గోవిందవాడ గ్రామానికి చెందిన నరసింహ వృషభాలు మొదటి బహుమతి రూ. 20వేలు, దాత శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మస్తాన్ యాదవ్ వృషభాలు రెండో బహుమతి రూ.15వేలు, పులికొండ గ్రామానికి చెందిన బాలయ్యగల్ మాధవరాజు వృషభాలమూడో బహుమతి రూ. 10వేలు గెలుచుకున్నాయి. లింగ దహళ్ గ్రామానికి చెందిన ఎర్రిస్వామివృషభాలు నాల్గో బహుమతి రూ.8వేలు, ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన గాలి సీనప్పవృషభాలు ఐదో బహుమతి రూ. 5 వేలు గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సల్లాపురం బాబు, సంగప్ప, నవీన్, మున్నా, మాజీ సర్పంచ్ కోటేశ్వర్ రెడ్డి, కృష్ణాపురం శీను, తదితరులు పాల్గొన్నారు.


