- Advertisement -
విశాలాంధ్ర-తాడిపత్రి: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బారాయుడు (63) విద్యుత్ షాక్ తగలి మృతి చెందాడు. తన ఇంటి ముందర మేడిచెట్టు కొమ్మలను మచ్చుకోడవలితో నరుకుచుండగా ఆకస్మాత్తుగా కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. కరెంట్ తీగలు తెగి సుబ్బారాయుడు ఎడమ మోకాలిపైన పడటంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భార్య రమణమ్మ పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శంకర నారాయణ కేసు నమోదు చేశాడని ఎస్సై తెలిపారు.


