దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray)కు రూ.500కోట్ల లీగల్ నోటీసు జారీ అయింది. ఆయనతో పాటు ఎన్‌సీపీ (ఎస్పీ), మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కూడా ఈ నోటీసులు అందాయి. తన కుమార్తె మృతిపై న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితమైనదిగా, కుట్రపూరితమైనదిగా చిత్రీకరించేందుకు ఆదిత్య థాకరే, అనిల్ దేశ్‌ముఖ్ యత్నించారని దిశ శాలియన్ తండ్రి సతీశ్ శాలియన్ ఆరోపించారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలు వ్యాప్తి చేసినందుకు అన్ని ప్రధాన మీడియా, డిజిటల్ వేదికల ద్వారా బహిరంగంగా, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆదిత్య థాకరే వ్యాఖ్యానించడాన్ని కూడా సతీశ్ శాలియన్ తప్పుబట్టారు. ఈ పరిణామంపై స్పందించిన ఆదిత్య థాకరే, తనకు దిశ సాలియాన్‌తో ఎలాంటి పరిచయం లేదని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు వ్యక్తులు గత ఆరేళ్లుగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500కోట్ల లీగల్ నోటీసు
- Advertisement -
RELATED ARTICLES


