బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 19) సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అల్పపీడనం రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడనుందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని అధికారులు కోరారు.
ఏపీ తీరం దిశగా అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు వర్ష సూచన
- Advertisement -
RELATED ARTICLES


