తహసీల్దార్ జయశ్రీ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వజ్రకరూరు మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తహసీల్దార్ జయశ్రీ హాజరై పోటీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయశ్రీ మాట్లాడుతూ పండుగల సందర్భంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోనాలిసా, అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్, వినాయక ఉత్సవ సమితి నిర్వాహకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.


