Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ బిల్లులను డిజిటల్ పద్ధతిలో కూడా చెల్లించవచ్చును..

విద్యుత్ బిల్లులను డిజిటల్ పద్ధతిలో కూడా చెల్లించవచ్చును..

- Advertisement -

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏడిఈ.. లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలు విద్యుత్ బిల్లును డిజిటల్ పద్ధతిలో కూడా చెల్లించవచ్చునని విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ డి ఈ లక్ష్మీనారాయణ, డివిజన్-1 నాగభూషణం, డివిజన్-2 రామాంజనేయులు, రూరల్ ఏఈ జానకి రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యానికి నాలుగు సులభమైన మార్గాలు ఉన్నాయని తెలిపారు. అందులో క్యూఆర్ కోడ్ ద్వారా, ఏపీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా, సదరన్ పవర్ యాప్ ద్వారా, మనమిత్ర వాట్సాప్ ద్వారా చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన విద్యుత్ శాఖలో సెలవులతో కలిపి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం 5 వరకు కూడా నేరుగా నగదును చెల్లించవచ్చునని వారు తెలిపారు. విద్యుత్ బిల్లును వినియోగదారులు సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖ అభివృద్ధికి తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు. సమయం ఆదా చేస్తూ క్యూలలో నిలబడే అవకాశం లేదని డిజిటల్ చెల్లింపులు ఎంతో ఉత్తమము అని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు