విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 ఓపెన్ క్యాటగిరి, రిజర్వ్ కేటగిరి ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మద్యం షాపుల రెన్యువల్ నిమిత్తం గెజిట్ విడుదల చేయడం జరిగిందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్ హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. లైసెన్స్ ఫీజు మొత్తంలో 38 శాతం రెన్యువల్ ఆర్ఈటి మొత్తమును చెల్లించవలసి ఉంటుంది అని తెలిపారు. దీనికి అదనంగా 2026-27 సంవత్సరమునకు మొత్తం లైసెన్స్ ఫీజును ఏక మొత్తంలో గాని లేక ఆ ఈ టి ఓ పి 1/4 మొత్తముగా గాని చెల్లించాలన్నారు. అదేవిధంగా తమ పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజులో మూడవ వంతు చెల్లించవలెనని తెలిపారు. తదుపరి ప్రాసెసింగ్ ఫీజు మొత్తము కమిషన్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారికి ఐదు వేల రూపాయలు డి డి రూపంలో చెల్లించాలన్నారు. అర్హులైన లైసెన్స్ దారులకు 6/10/2026 నుండి30/09/2027 వరకు మద్యం అమ్మకమునకు అవకాశం ఉంటుందని తెలిపారు.
మద్యం షాపుల రెన్యువల్ నిమిత్తం గెజిట్ విడుదల… ఎక్సైజ్ సి ఐ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


