Homeజిల్లాలుఅనంతపురంగణనాథుని లడ్డూ వేలంపాటలో రూ.39వేలకు సొంతం

గణనాథుని లడ్డూ వేలంపాటలో రూ.39వేలకు సొంతం

- Advertisement -

విశాలాంధ్ర-​రాప్తాడు : మండల పరిధిలోని గోళ్లపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన గణనాథుని లడ్డూకు బుధవారం వేలంపాట నిర్వహించిన వేలంపాటలో గ్రామంలోని భక్తులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఈ పాల్గొన్నారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ వేలంలో స్వామివారి ప్రసాద లడ్డూను గోళ్లపల్లికి చెందిన బుడ్డారెడ్డిగారి ప్రేమచంద్రారెడ్డి రూ.39,000 కు దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న భక్తుడిని స్థానికులు, గ్రామస్తులు అభినందించారు. స్వామివారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా భక్తులు కోరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు