Homeతెలంగాణహైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు

హైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు

- Advertisement -

మెట్రో రైల్‌ ఆన్‌లైన్‌ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది.సెన్సార్లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే గేట్ల వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.సమస్య కారణంగా ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆన్‌లైన్‌ సేవలు పనిచేయకపోవడంతో సమస్యను పరిష్కరించడంలో అక్కడి సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు