Wednesday, January 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయియూటీఎఫ్ ధర్మవరం జోన్ సౌజన్యంతో యుటిఎఫ్ మోడల్ పేపర్స్ వితరణ..

యూటీఎఫ్ ధర్మవరం జోన్ సౌజన్యంతో యుటిఎఫ్ మోడల్ పేపర్స్ వితరణ..

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జయ చంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం ; ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించే పదవ తరగతి మోడల్ పేపర్లను ధర్మవరం యుటిఎఫ్ జోన్ సౌజన్యంతో స్థానిక ధర్మవరం పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ధర్మవరం పట్టణంలో 10వ తరగతి చదువుతున్న పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పిల్లలకు 46 మంది విద్యార్తులందరికీ మోడల్ పేపర్స్ ను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని, ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి అనంతరం మాట్లాడుతూ యుటిఎఫ్ మోడల్ పేపర్స్ ను బాగా చదివి మంచి మార్కుల తో ఉత్తీర్ణత సాధించి మన ఊరికి, మీ తల్లి తండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏడాది మోడల్ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తున్నదని, మోడల్ పేపర్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందించబడి తెలుగు తోపాటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా, 100 రోజుల ప్రణాళికకు అనుకూలంగా తయారుచేసి అందించడం జరుగుతున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్థానిక సిఐటియు నాయకులు జెవి రమణ, ధర్మవరం యుటిఎఫ్ జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు,అమర్ నారాయణరెడ్డి, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు