Wednesday, December 4, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడోలా రాజారెడ్డి సేవలు అనన్యమైనవి.. ఆర్డీవో మహేష్

డోలా రాజారెడ్డి సేవలు అనన్యమైనవి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం:: డోలా రాజారెడ్డి సేవలు అనన్యమైనవని, సేవా కార్యక్రమాలను చేయుటలో వారికి వారే సాటి అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి మాల ధారణ వేసిన భక్తాదులకు గత 16 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న వాటికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మానవసేవే మాధవసేవ అన్న సూక్తితో డోలా రాజారెడ్డి ముందుకు వెళ్లడం, ఈ అన్నదాన కార్యక్రమం వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు కూడా అందజేస్తాడని తెలిపారు.తదుపరి డోలా రాజారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే ఆశీస్సులు మేరకు తాను ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం నాకెంతో సంతృప్తిని ఇస్తోందని తెలిపారు. మాల ధారణ వేసిన భక్తాదులకు ఇటువంటి సౌకర్యముకు అవకాశం కల్పించిన ఆ భగవంతునికి నేను రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం మాలాధారణ వేసిన భక్తాదులకు ఆర్డిఓ చేతుల మీదుగా భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.తదుపరి ఆర్డీవో మహేష్ బాబా దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఆర్డీవో మహేష్ కు ఘన స్వాగతం పలుకుతూ, ఆలయ వివరాలు, ఆలయ అభివృద్ధి తదితర వాటిని తెలియజేశారు. తదుపరి ఆలయ కమిటీ వారు ఆర్డిఓ మహేష్ని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 900 మందికి పైగా మాల ధారణ భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు