Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదానం దైవ సేవతో సమానం

అన్నదానం దైవ సేవతో సమానం

- Advertisement -

గురూజీ లు యోగి ముక్తేశ్వరీ మాతాజీ, మోక్షి ముక్తేశ్వరీ మాతాజీ

విశాలాంధ్ర ధర్మవరం: అన్నదానం దైవ సేవతో సమానమని పరమ సంస్థానం శ్రీ పరమ పిత శ్రీ వెంకటరమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్ట్ గురువులు యోగి ముక్తేశ్వరీ మాతాజీ, మోక్షి ముక్తేశ్వరీ మాతాజీలు తెలిపారు. ఈ సందర్భంగా 14వ ఆరాధన మహోత్సవములు పురస్కరించుకొని చివరి రోజు గురువులైన మాతాజీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి హాజరు కావడం జరిగింది. అనంతరం ఎస్సై ఉమాదేవి మాట్లాడుతూ రమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందించదగ్గ విషయమని వారు తెలిపారు. అంతేకాకుండా వివిధ సేవా కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించడం ప్రజలకు మేలు కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైస్ చైర్మన్ అశోక్ కుమార్, కార్యదర్శి రామాంజనేయ ఆచారి ,ఉప కార్యదర్శి మల్లికార్జున, కోశాధికారి నాగభూషణం తో పాటు శిష్య బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు