Homeజిల్లాలువిజయనగరంకొత్తా అనంతరావు కుటుంబ సభ్యులకు డా. రాజేశ్ పరామర్శ

కొత్తా అనంతరావు కుటుంబ సభ్యులకు డా. రాజేశ్ పరామర్శ

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణానికి చెందిన రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్తా ఆనంతరావు మృతి పట్ల రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ తీవ్ర సంతాపం తెలిపారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా డా. తలే రాజేష్ మాట్లాడుతూ, ఆనంతరావు మృదు స్వభావంతో సేవాభావం కలిగిన వ్యక్తి అని, పలు సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్‌లలో క్రియాశీలకంగా పనిచేసి సమాజానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పొగిరి లెనిన్, పాలవలస శ్యామ్ సుందరరావు, డా. బి. నరేంద్ర, కొండేటి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు