విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో రాజాం టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్‌ను కోండ్రు జగదీష్ కట్ చేసి, ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ కి పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లను కోండ్రు జగదీష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అలాగే సారధి రోడ్‌లోని డెఫ్ అండ్ డం స్కూల్ విద్యార్థులకు పండ్లు, భోజనాలు ఏర్పాటు చేయగా, కొండంపేట గ్రామంలోని అనాథ ఆశ్రమంలో కూడా భోజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ జన్మదిన వేడుకలు-సేవా కార్యక్రమాలు
- Advertisement -


