Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య

జీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన గూడూరు ఆంజనేయులు (76) జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ మృతుడు బిపి, షుగర్ ఉన్నందున కొన్ని నెలల కిందట కుడికాలను ఆపరేషన్ చేసి తొలగించడం జరిగిందని, అనంతరం ఏడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో అదే కాలుకు తిరిగి దెబ్బ తీవ్రంగా తగలడంతో, కుటుంబ సభ్యులు కాలుకు ప్లేటు వేసి వైద్య చికిత్సలను అందించారు. కానీ తనవల్ల కుటుంబంతో పాటు తన భార్య మస్తానమ్మ కూడా ఇబ్బందులు పడుతోందన్న మనసులో పెట్టుకొని, మనస్థాపనతో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకోవడం జరిగిందని తెలిపారు. మృతులకు భార్య మస్తానమ్మతో పాటు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు కలరు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు