గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని గ్రంథాలయ అధికారిని సౌభాగ్యవతి అంజలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో చివరి రోజు బుధవారం వివిధ పోటీలలో పాల్గొని విజేతలైన వారందరికీ బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువర్స్ ఫౌండేషన్ బండ్లపల్లి రంగనాథ్, ఎల్ఐసి నాగరాజ్, హెడ్మాస్టర్ కవిత, కలవల శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి, ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయమును వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చదువుతోపాటు నిరుద్యోగులకు కావలసిన అన్ని స్టడీ మెటీరియల్ కూడా లభ్యమవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రంథాలయ సభ్యత్వమును ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు నిరుద్యోగులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ వారోత్సవాలకు సహకరించిన వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్ లతోపాటు అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..
RELATED ARTICLES