Wednesday, December 4, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుంది..

చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుంది..

కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుందని కంటి వైద్య నిపుణులు రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు”జాతీయ హ్రస్వ దృష్టి వారోత్సవాలు” ముగింపు కార్యక్రమంను పురస్కరించుకొని కంటి చూపు సమస్యలు వాటి పరిష్కారం పై పలు విషయాలను పాఠశాల ప్రార్థన సమయంలో తెలియజేశారు. అదేవిధంగా కంటిని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటికి భద్రత ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని విశదీకరించారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులందరికీ కంటి చూపు సక్రమంగా ఉంటే చక్కటి విద్య లభిస్తుందని, అప్పుడే ఉత్తమ పరీక్ష ఫలితాలు లభించే అవకాశం ఉన్నాయని తెలిపారు. ప్రతి తరగతి లోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క కంటి చూపు పై శ్రద్ధను కనపరచాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా సమిష్టిగా తమ పిల్లల పట్ల తప్పనిసరిగా శ్రద్ధను చూపాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క దృష్టి లోపాలను గుర్తించి కంటి డాక్టర్ సలహాతో వైద్య చికిత్సలు చేయించి కంటి అద్దాలను ఉపయోగించాలని తెలిపారు. నా కూతురు అయిన మధు బిందు, పూర్వ విద్యార్థి చంద్రశేఖర్ రెడ్డి తాము చదువుకున్న జీవన్ జ్యోతి లో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమని వారు తెలిపారు. చదువులో బాగా రాణించాలి అంటే చక్కటి కంటిచూపు ఎంతో అవసరమని, టీవీ, సెల్ ఫోన్ లకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. ఇవి అలవాటు పడితే చదువులో కూడా వెనుక పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా కంటికి దగ్గరగా పెట్టుకుని చదువుతూ ఉంటే దృష్టిలోపముగా గుర్తించవలెనని తెలిపారు. అదేవిధంగా తరగతి గదిలో నల్ల బోర్డు పై రాసిన అక్షరాలు కనపడని వారు కూడా దృష్టిలోపం ఉన్న వారిగా గుర్తించాలని తెలిపారు. కంటి చూపు పట్టిక ద్వారా కూడా కంటి దోషమును గుర్తించవచ్చునని తెలిపారు. అనంతరం పాఠశాల లోని 170 మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి వారి వారి యొక్క దృష్టిలోపమును తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుజాత, కర్రీస్పాండెంట్ రెన్సి, పూర్వపు విద్యార్థి, ఎంటోడు ఫార్మా సిటికల్ లిమిటెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్ చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు