విశాలాంధ్ర – కొవ్వూరు : దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు మరవలేనివని, వారిని గౌరవించడం మన బాధ్యత అని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమాక జయరాజు అన్నారు. తొలితరం ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కొవ్వూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏడిఏ ఎం కృష్ణ నాయక్, ఏఈ లు డి జగదీశ్వరరావు, సీహెచ్ శ్రీనివాసరావు ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏడిఏ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఇంజనీర్స్అందరి కీఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంజనీరింగ్ ప్రతిభలో అసాధన విజయం సాధించిన వారిలో భారతజాతి గరించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరరావు అని చదువుతోపాటు నైపుణ్యాన్ని కనపరచడమే ఇంజనీరింగ్ అని అన్నారు లైన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో లయన్స్ సభ్యులు బి వెంకటేశ్వరరావు, ఎం హుస్సేన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
లయన్స్ క్లబ్ లో ఇంజనీర్స్ డే
- Advertisement -
RELATED ARTICLES


